కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిదిలో అత్తింటి వేధింపులు తాళలేక భర్త ఇంటి ముందు టెంట్ వేసుకొని ధర్నాకు దిగింది. కైలాష్ హిల్స్ లో ఓ యువకుడికి జయశ్రీ(25)అనే యువతిని ఇచ్చి పెళ్లి చేశారు. అత్తింటి వారికి 5 కిలోల వెండి, బంగారు ఆభరణాలు 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అదనపు కట్నం కోసం కోడలిని నిత్యం అత్తింటి వారు వేధిస్తున్నారు. ఎదురుతిరిగి మాట్లాడితే ఇంట్లోకి రానివ్వకుండా వ్యభిచారం చేస్తుందని పుకార్లు లేపి మానసికంగా కోడలిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన అత్తమామ, భర్త వేధింపులతోనే విసిగిపోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో అత్తగారింటి ముందు టెంట్ వేసుకుని బంధువులు,  ఫ్లెక్సీతో ధర్నాకు దిగింది.