మన తెలంగాణ/క్రీడా విభాగం: వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియాకు గురువారం నుంచి జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ సవాల్‌గా మారింది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లలో భారత్‌కు పరాజయాలు ఎదురయ్యా యి. ఇలాంటి స్థితిలో జింబాబ్వే సిరీస్ టీమిండియాకు పరీక్షగా మారింది. కొంతకాలంగా జింబాబ్వే అద్భుత ఆటతో అలరిస్తోంది. పలు సిరీస్‌లలో సంచలన విజయాలు సాధించింది. బంగ్లాదేశ్, ఐర్లాండ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక తదితర జట్లపై మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. బంగ్లాదేశ్‌పై టెస్టులో చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. దీంతో జింబాబ్వే ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్న జింబాబ్వే స్వదేశంలో భారత్‌తో జరిగే సిరీస్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. బ్యాటిం గ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది.

ప్రతిభావంతులైన ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. మరోవైపు భారత్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లలో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిం ది. టి20 టీమ్‌కు సారథ్యం వహిస్తున్న శ్రేయ స్ అయ్యర్ తొలి రెండు సిరీస్‌లలో తేలిపోయాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన టి 20 సిరీస్‌లలో టీమిండియా వైట్‌వాష్‌కు గు రైంది. ఐర్లాండ్‌తో ఆడిన రెండు మ్యాచుల్లో నూ ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగు పోటీల్లో పరాజయం చవిచూసింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యిం ది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో సిరీస్ కీలకంగా తయారైంది. సమష్టిగా రాణిస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటా యి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ సింగ్, శివమ్ దూబె తదితరులు మెరుగైన ఆటను కనబరచాల్సి ఉంటుంది. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తన పాత్రను సమర్థంగా పోషించాలి. అప్పుడే టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.