నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో మహాత్మా గాంధీ వేషధారణలో పాల్గొన్న ఓ వృద్ధుడు అందరి దృష్టిని ఆకర్షించారు. పోలీసుల లాఠీచార్జ్, ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన అక్కడ కనిపించడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉద్యమాన్ని అహింసా మార్గంలో, శాంతియుతంగా కొనసాగించాలనే సందేశంతో ఆయన నిరసనలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఆయన గుర్తింపు, నిరసనలో పాల్గొన్న ఉద్దేశంపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు.

The post జంతర్ మంతర్ వద్ద నిరసన.. గాంధీజీ వేషధారణలో వృద్ధుడు appeared first on Navatelangana.