మహేశ్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచియమైన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమా గురువారం(జులై 30) విడుదలైంది. ఈ సినిమా ఫ్యాన్స్‌లో కొందరికి నచ్చింది.. కానీ, చాలామందికి మాత్రం సినిమా నచ్చలేదని అని అంటున్నారు. రవీనా టండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైన ఈ సినిమాకి ‘ఆర్ఎక్స్100’, ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు.

అయితే తొలి సినిమా కావడంతో జయకృష్ణ యాక్టింగ్‌లో ఫర్వాలేదు అనిపించాడు. సినిమా చూసిన అభిమానులు జయకృష్ణ ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉందని అంటున్నారు. ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. తొలి రోజు ఈ సినిమా రూ.1.25 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయని సమాచారం. కొత్త హీరోకి ఈ వసూళ్లు తక్కువే కావొచ్చు కానీ, ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లేదు. ఉన్నంతలో ఘట్టమనేని అభిమానులు సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మరి ఇది ఈ సినిమాకి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.