
న్యూఢిల్లీ: నీట్ వ్యతిరేక ఆందోళనల సమయంలో చోటు చేసుకున్న విద్యార్థుల అరెస్టుల వ్యవహారం లో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో అరెస్టయిన వారిలో మైనర్లు, నేరాభియోగాలు లేని వారిని వెంటనే విడుదల చేయాల ని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇక నిరసనల న మయంలో పోలీసుల చర్యలకు సంబంధించి వస్తో న్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది.నీట్‌యూజీ ప్రశ్నపత్రం లీకేజీ పరీక్షల వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలకు దిగిన విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జి, భాష్పవాయువు గోళాలను ప్రయోగించారంటూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం మరోసారి వి చారణ జరిపింది.
ఈ సందర్బంగా ఆందోళనకారుల అరెస్టులపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృ త్వంలోని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చిం ది. 18 ఏళ్ల లోపు విద్యార్థులు, నేరచరిత్ర లేనివారిని విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై ఢిల్లీ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగించవచ్చని ధర్మాసనం తెలిపింది. కానీ విద్యార్థులపై ఎలాంటి తక్ష ణ, కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. అ యితే నేరాభియోగాలు ఉన్న ఆందోళనకారులకు ఈ ఉత్తర్వులు వర్తించవని స్పష్టం చేసింది. విద్యార్థుల నిరసన సమయంలో పోలీసులపై అనేక ఆరోపణలు వచ్చాయి. పోలీసుల చర్యల కారణంగా మహిళలు, న్యాయవాదులు, మీడియా, వ్యక్తులు గాయపడినట్టు కథనాలు వస్తున్నాయి.
ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు ఎందుకు చేయకూడదు ? దేశ వ్యాప్తంగా శాంతియుత నిరసనల నిర్వహణ , పోలీసుల చర్యలకు సంబంధించి ఏకరూప మార్గదర్శకాలు రూపొందించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే వారిని విచారించి శిక్షించాలి ” అని ధర్మాసనం వెల్లడించింది. ఇక 250 మంది పోలీసులపై ఆందోళనకారులు దాడి చేసినట్టు వచ్చిన నివేదికలపైనా దర్యాప్తు జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ దాడులు చేసింది విద్యార్థులా లేదా నేరగాళ్ల అన్నది తేల్చాలని పేర్కొంది. ఈ అంశాలపై స్వతంత్ర పారదర్శక దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ఈ క్రమం లోనే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు , ఇతర వివరాలను భద్రపర్చాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ డిజిటల్ డేటాను పబ్లిక్ డొమైన్ లోకి తీసుకురావొద్దని స్పష్టం చేసింది.











