
తెలుగు సినీ సంగీత దర్శకుడు కాల భైరవ తన రిలేషన్షిప్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ గురించి సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దాన్నే నిజం చేస్తూ కాలభైరవ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
కావ్యతో ఉన్న ఫొటోలను పంచుకున్న కాల భైరవ ‘‘నీతో ఉంటే కొండల మధ్య కూర్చొని, పారే సెలయేరును చూస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. నీతో కలిసి చేసే ఏ చిన్న పని అయినా, ఎప్పటికీ ముగియకూడదనిపించే అందమైన విహారయాత్రలా అనిపిస్తుంది. నీతో మాట్లాడే ప్రతి సంభాషన, శీతాకాలపు ఉదయాల్లో ఇష్టమైన కాఫీని ఆస్వాదించినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో.. ఈ అనుభూతికి ఏ పేరు పెట్టాలో నాకు నిజంగా తెలియలేదు. మన ప్రయాణంలో ఈ అనుభూతికి నాకు అర్థం తెలిసింది. ఆ భావనే ‘కుటుంబం’. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు కొత్త వ్యక్తిలా అనిపించలేదు. నేనిప్పుడు నీ గమ్యాన్ని చేరుకున్నా. ఆ క్షణం నుంచి వదిలి రాలేదు. మేమిద్దరం జీవితాంతం ఒకరికొకరం తోడూనీడగా ఉంటామన్న విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని అన్నారు.








