
ముంబయి: కదులుతున్న కారులో ముగ్గురు పిల్లల ముందే భార్యను చంపి అనంతరం కారులో మృతదేహంతో ప్రయాణించి అనంతరం పోలీస్ స్టేషన్‌లో భర్త లొంగిపోయిన సంఘటన మహారాష్ట్రలోని వంశీ జిల్లాలోని సమ్రుద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.... యుపికి చెందిన సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య హసీనా బానో(28), తన ముగ్గురు పిల్లలతో కలిసి ముంబయిలో నివసిస్తున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి కారులో సమృద్ధి మహామార్గ్‌లో ప్రయాణి చేస్తున్నారు. దంపతుల మధ్య గొడవ జరగడంతో కదులుతున్న కారులో భార్యను ఇనుప రాడ్‌తో కొట్టాడు. అనంతరం భార్య గొంతు నులిమి చంపేశాడు. భార్య మృతదేహంతో కారులో ప్రయాణించి అనంతరం కరంజా సిటీ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. భార్యపై అనుమానంతో ఆమెను చంపానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.









