నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న కెబిఆర్ పార్క్‌లో శనివారం ఉదయం కొండ చిలువ కనిపించడం కలకలం సృష్టించింది. ఉదయం వాకింగ్ చేస్తుండగా సుమారు 20 అడుగులు ఉన్న భారీ కొండ చిలువ పార్క్‌లోని నడక మార్గంలో నెమ్మదిగా దాటుతుండడం కన్పించింది. దానిని చూసిన వాకర్స్ కొంత సేపు వాకింగ్‌ను ఆపి కొండ చిలువ అటవీ ప్రాంతంలోకి వెళ్లే వరకు వేచి ఉన్నారు.