న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ కేజ్రీవాల్ నివాసమంటూ చూపించడానికి బీజేపీ నకిలీ చిత్రాలు ఇంటర్నెట్ నుంచి తీసుకుని ప్రసారం చేస్తోందని, అలాగే పచ్చిఅబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్ అధికారప్రతినిధి ప్రియాంక కక్కర్ వెల్లడించారు. శనివారం ఉదయం నుంచి బీజేపీ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయిస్తోందని, అలాగే కేజ్రీవాల్ నివాసమని నకిలీ చిత్రాలను ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు. ఇది కేవలం ఒక కుట్ర అని.. బీజేపీ నాయకుడు, ఎంపి బన్సూర్ స్వరాజ్ ఈ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విధంగా ప్రధాని నరేంద్రమోడీ నివాసాన్ని చూపించగలరా? అని బీజేపీని సవాలు చేస్తున్నట్టు ఆమె చెప్పారు.

“బీజేపీ భయపడుతోంది. ఇంటిచుట్టూ వారు బారికేడ్లు పెట్టారు. మేం సవాలు చేస్తున్నాం. మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్ లోకి మేం ప్రవేశిస్తామని వారు భయపడుతున్నారు. గుజరాత్ నుంచి వారిని ఆప్ తరిమి వేస్తుంది” అని కక్కర్ వ్యాఖ్యానించారు.