
పిఎం ఆఫీసు నుంచి
పిలుపు వచ్చిందంటూ జోరుగా ప్రచారం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్షంగా పావులు కదుపుతున్న బిజెపి జాతీయ నాయకత్వం త్వరలో జరగబోయే కేంద్ర మం త్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో తెలంగాణ నుంచి ఎంపీలు ఈటల రాజేందర్, డి.కె. అరుణకు ఛాన్స్ దక్కబోతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. అంతేకాకుండా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వారిరువురికీ ఫోన్ వ చ్చిందన్న పుకార్లు షికారు చేశాయి. అయితే తమకు అటువం టి సమాచారం ఏదీ అందలేదని ఎంపీలు తెలిపారు. పార్టీ జాతీ య కార్యవర్గంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న డి.కె. అరుణను ఇటీవల తప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదవి పోయినం త మాత్రాన తాను బాధ పడడం లేదని, పార్టీ జాతీయ నాయకత్వం తనకు అంత కంటే పెద్ద బాధ్యత మోపనుందేమోనని భావిస్తున్నానని ఎంపీ అరుణ రెండు రోజుల క్రితం మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బుస్సు సౌకర్యం కల్పించి మహిళా ఓటు బ్యాం కుపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నందున, రాష్ట్రం నుంచి మహి ళా ఎంపీ డికె అరుణను నియమించడం వల్ల మేలు జరుగుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి పోన్ వచ్చినప్పుడు తాను అక్కడే ఉన్నానని ఒకరంటే, ఢిల్లీకి బయలుదేరారని మ రొకరు, టివీల్లో ఫ్లాష్ స్యూస్ స్క్రోలింగ్ చూశానని మరి కొం దరు ఇలా ఆదివారం విస్తృత ప్రచారం జరిగింది. ఎంపీ ఈట ల రాజేందర్‌కు బిసి కోటాలో ఛాన్స్ దక్కనుందన్న ఊహగానాలు వీస్తున్నాయి. కాం గ్రెస్ పార్టీ బిసి రిజర్వేషన్ల గురిం చి మాట్లాడడం, రాష్ట్ర ప్రభుత్వం బిసి కులగణన చేయించడం వంటివి దృష్టిలో పెట్టుకుని వారి ఎత్తుగడలను అధిగమించేందుకు ఈటలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినందున, ఈటలను మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటారన్న ప్రశ్న, అనుమానాలు పార్టీ నేతలకు లేకపోలేదు.
ఇద్ద రు బిసిలు ఉంటే అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు అవుతుంది కదా అని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారేమోనన్న చర్చ జరుగుతున్నది. రాబోయే రోజుల్లో బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే అధ్యక్ష పదవి మార్పు ఇప్పటికిప్పుడే జరిగే అవకాశం లేదు. రాంచందర్ రావును ఎన్నికల వరకు కొనసాగించి, సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తారని కొందరు, మంత్రి బండి తన కుమారుని కేసులో వెనకేసుని రాకుండా స్వయంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళి అప్పగించి ఉంటే ఆయన ప్రతిష్ట మరింత ఇనుమడించేదన్న ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రం నుంచి జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నందున మరో ఇద్దరికి ఛాన్స్ దక్కే అవకాశం లేదంటున్నా, కొత్తగా ఈటల, అరుణను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటే వారికి సహాయ మంత్రి హోదా పదవులతోనే సరిపుచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు అంటున్నారు.











