
ఒట్టావా: కెనడాలోని సర్రెనగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూటన్ ప్రాంతం 7000 బ్లాక్ లోని 133 బి స్ట్రీట్ లోగుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో ఇద్దరు భారతీయ యువకులు మృతి చెందారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండుగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల వయసు 16, 18 ఏళ్లుగా ఉందని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు కాల్పులు జరిపారు అనేది తెలియాల్సి ఉంది.













