
తిరువనంతపురం : కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ సారి ముచ్చగా ముగ్గురు బిజెపి ఎంఎల్‌ఎలుగా ఎన్నికయ్యారు. పేదళ్ల తర్వాత తిరిగి కమలం నేతలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో కాళకూటం, చాతన్నూర్, నేమోం అసెంబ్లీ స్థానాల నుంచి బిజెపి అభ్యర్థులు గెలుపొందారు. నేమోం నుంచి కేరళం బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, చాతన్నూర్ నుంచి గోపకుమార్, కాళకూటం నుంచి కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ విజయం సాధించారు. వీరు ముగ్గురు స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కినప్పటికీ ఒక్క సీటు కూడా కేరళంలో బిజెపి గెలవబోదన్న విపక్షాల వ్యాఖ్యలకు తాము దీటైన సమాధానం ఇచ్చామని బిజెపి వర్గాలు సమర్థించుకున్నాయి.












