మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా ఈ నెల (మే నెల) చి వరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇ న్‌చార్జి మంత్రులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్, రె వెన్యూ, ఫారెస్టు అధికారులతో సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చివరి దశలో ఉన్న ఇళ్లను వీలైనం త త్వరగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అంసపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఇంతవరకు ఖర్చు చేసి న మొత్తాన్ని మినహాయించి, తదుపరి అవసరమైన వ్యయాన్ని ఐదు లక్షలలోపు ఇందిరమ్మ ఇ ళ్ల పథకం ద్వారా అందజేస్తామని మంత్రి పొం గులేటి వెల్లడించారు. వాటిని పూర్తిచేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులే నిర్మించుకునేలా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు గ్రీన్ చానల్లో నిధులు విడుదల చేస్తామన్నారు.

చాలా ఇళ్లలో అనర్హులు ఉన్నారు

చాలా ఇళ్లలో అనర్హులు ఉన్నారని, వారిని తొలగించి అర్హులకు ఇవ్వాలని సమావేశంలో పాల్గొ న్న పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే అనర్హులను తొలగించే చర్యలు చేపట్టాలని, అర్హులకు కేటాయించాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఇందులో ఎమ్మెల్యేలను భాగస్వామ్యులను చేయాలని ఆయన సూచించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడితే సర్వీసు నుంచి తొలగించడానికి సైతం వెనకాడబోమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. పేదరికమే అర్హత అని, అర్హులైన వారికి ఇళ్లను ఇవ్వడమే కలెక్టర్ల బాధ్యత అని ఆయన సూచించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందజేస్తున్నామని ఆయన తెలిపారు. నగరానికి దూరంగా డబుల్ బెడ్‌రూం కాలనీలను నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఇష్టపడటం లేదన్నారు. ఆయా కాలనీలకు సమీపంలో నివసించే వారికి కేటాయించలన్న ఆలోచన చేస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేదు..

ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. భూముల ఆక్రమణలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్టు భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం రెవెన్యూ, ఫారెస్టు విభాగాలు జాయింట్ సర్వే నిర్వహించాలని ఆయన ఆదేశించారు. దీనిద్వారా భవిష్యత్‌లో వివాదాలకు తెరపడుతుందన్నారు. రాష్ట్రంలో భూ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ ద్వారా సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. భూ రికార్డుల్లో పాదర్శకత, కచ్చితత్వం తీసుకు రావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్‌లను మండలాలను ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల్ల పథకం బాగుంది: మంత్రి శ్రీధర్‌బాబు

ఐటీ, పరిశ్రలమ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల్ల పథకం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ పథకం చాలా అద్భుతంగా అమలవుతుందని ఆయన చెప్పారు. దీనిపై కలెక్టర్లు మరింత ఫోకస్ పెట్టాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్‌కుమార్, హౌసింగ్ కార్యదర్శి విపి గౌతం తదితరులు పాల్గొన్నారు. అనంతరం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో 30 కెవి ఉత్పాదన సామర్థ్యంతో నెలకొల్పిన సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు.