గండిపేట్ పరిధిలోని కిస్మత్‌పూర్‌లో పోలీసులు డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎండీఎంఏ, 730 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్లు మరియు ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో మూడు నుంచి నాలుగు వరకు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు, ఒడిశా నుంచి మాదకద్రవ్యాలను తెప్పించి స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం నిందితులను తదుపరి చర్యల కోసం గండిపేట్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించారు.