
హైదరాబాద్: ‘కల్కి-2’లో కీలక పాత్ర.. జెడి చక్రవర్తి రియాక్షన్ ఇదే..!న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ సినిమాకి త్వరలో సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్‌కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. తొలి భాగంలో చాలా మంది నటీనటులు, దర్శకులు ప్రత్యేక పాత్రలో కనిపించారు. దీంతో సీక్వెల్‌లో కూడా చాలా కామియోలు ఉండే అవకాశం ఉంది. అందులో నటుడు జెడి చక్రవర్తి ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను జెడి చక్రవర్తి ఖండించారు. తన కొత్త చిత్రం ‘గాయపడిన సింహం’ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఈ సీక్వెల్‌లో నటించడం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ వార్తలు విని ఎంజాయ్ చేశానని.. అందులో ఏ మాత్రం నిజం లేదన పేర్కోన్నారు. దీంతో ఈ రూమర్‌కి చెక్ పడింది.











