సూర్య వశిష్ట, దీప్షిక హీరో హీరోయిన్లుగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ అందించారు. మే 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ “ఇది చాలా మంచి కథ. మంచి ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటాయి. సినిమా చూసే ప్రేక్షకులు మంచి ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు”అని పేర్కొన్నారు. రామ్ జగదీష్ మాట్లాడుతూ “రమణీ కళ్యాణం చాలా స్పెషల్ ఫిల్మ్. కళ్లులేని అమ్మాయి, కాళ్లు లేని అబ్బాయి.. వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే స్క్రీన్‌పై ఎలా ఉంటుందో అనిపించింది. దాన్ని చాలెంజ్‌గా తీసుకుని సినిమా చేశాం”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిజి విశ్వప్రసాద్, సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్, శ్రీనివాస్ రెడ్డి, అలీ, సూరజ్, యువరాజ్ పాల్గొన్నారు.