మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలను భారీగా పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పెంచిన ఈ కొత్త వే తనాలు వచ్చే జూన్ 1నుంచి అమల్లోకి రానున్నాయ ని ఆయన స్పష్టం చేశారు. వేతనాల సవరణ కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించామని ఇందులో జోన్-1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2 కింద మున్సిపాలిటీలు, జోన్-3 కింద గ్రామీణ ప్రాంతాలను చేర్చినట్లు సిఎం వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు పెంచిన కనీస వేతనాలు వచ్చేనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సిఎం ప్రకటించారు. కార్మికుల కనీస వేతనాలపై గతంలో మం త్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని, ప్రస్తుతం కా ర్మికులను నాలుగు విభాగాలుగా చేసి కనీస వేతనా లు నిర్ణయించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. కా ర్మికుల కనీస వేతనాల పెంపుపై కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంటకస్వామితో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి గురువారం

సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనీస వేతనాల పెంపుతో దాదా పు 1,11,56,204 కోట్ల మంది కార్మికులు లాభం చే కూరుతుందని ఆయన తెలిపారు. గత పదేళ్ల కెసిఆర్ హయాంలో కార్మికుల కనీస వేతనాలను నిర్ణయించడంలో నిర్లక్ష్యం వహించారని సిఎం రేవంత్‌రెడ్డి మం డిపడ్డారు. ఫలితంగా రాష్ట్రంలో దాదాపు 1,11,56, 204 కోట్ల మంది కార్మికులు పదేళ్ల పాటు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందుకే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పా రు. అలాగే, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం త్వరలోనే ఒక అ ద్భుతమైన ‘గల్ఫ్ పాలసీ’ని తీసుకురాబోతున్నామని, ప్రస్తుతం గల్ఫ్ వెళ్లేవారి బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటోందని సిఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

‘బ్లూ కాలర్’ ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదు

కేవలం డిగ్రీలు పూర్తి చేసి, ఉద్యోగం లేదా ఉపాధి రాని చదువులతో ఎలాంటి ప్రయోజనం లేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని నైపుణ్య ఆధారిత చదువులపై దృష్టి పెట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర యువత తమ స్కిల్స్ పెంచుకుంటేనే మార్కెట్‌లో ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు. ఏఐ ఎంత వేగంగా విస్తరించినప్పటికీ శారీరక శ్రమతో కూడిన ‘బ్లూ కాలర్’ ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వైట్‌కాలర్ ఉద్యోగాలకే ముప్పు అని బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఉండదని ఆయన అన్నారు. నైపుణ్యాలు ఉన్న వారు కావాలని విదేశాలకు చెందిన కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లో చైనా, జపాన్, సౌత్ కొరియా దేశాల ఉత్పత్తులకు భారతదేశం దిక్సూచీగా మారిందని, ముఖ్యంగా తెలంగాణ కూడా ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని సిఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

హైస్కిల్డ్ కార్మికుల వేతనాలు రూ.20 వేలు

కార్మికులకు కనీస వేతనాలు పెంచడం వల్ల రాష్ట్రంలోని కోటి 11లక్షల మంది కార్మికులకు లబ్ది చేకూరనుందని, కార్మికుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కార్మికులను నాలుగు రకాలుగా విభిజించి ఈ వేతనాలను పెంచామని ఆయన పేర్కొన్నారు. అందులో అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్ గా విభజించి కనీస వేతనాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రోత్సాహాకాలను అందిస్తాం

స్కిల్స్ పెంచుకునేందుకు అవసరమైన ప్రోత్సాహాకాలను ఇస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నైపుణ్యాలు పెంచుకుంటేనే విదేశాల్లో రూ.2లక్షల వరకు వేతనం ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించలేని చదువులు వ్యర్థమని ఆయన అభిప్రాయపడ్డారు. జర్మనీ, జపాన్, సింగపూర్‌లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర యువత స్కిల్స్ పెంచుకొని విదేశీ ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.

యువతకు శిక్షణ: మంత్రి వివేక్

జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 120 అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ ఆధునిక కేంద్రాల ద్వారా మెరుగైన, పరిశ్రమల అవసరాలకు తగిన శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. ముఖ్యంగా యూరప్ లాంటి దేశాల్లో ఉద్యోగాలు సాధించాలంటే జర్మన్ తదితర విదేశీ భాషలపై పట్టు సాధించడం ముఖ్యమని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని యువతకు సూచించారు. తన ఇటీవలి జర్మనీ పర్యటనలో వైద్య, సాంకేతిక, తయారీ రంగాల్లో నైపుణ్యవంతులకు ఉన్న భారీ డిమాండ్‌ను తాను ప్రత్యక్షంగా చూశానన్నారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్నందున సంప్రదాయ ఉద్యోగ విధానాలు పూర్తిగా మారుతున్నాయని మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఇలాంటి ఆధునిక సాంకేతికతలో పోటీపడేలా శిక్షణ తీసుకుంటేనే అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని మంత్రి వివేక్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, భాషా శిక్షణపై రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టులను సైతం అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.