
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ శాసనసభలో మంత్రి సీతక్క మాట్లాడారు. స్పీకర్ తల్లిని అవమానించడం బాధకరమన్నారు. ఈ సమయంలో స్పీకర్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్పీ తాతా మధు వ్యాఖ్యలు బాధాకరమని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ‘‘సీతక్క ఐదేళ్లుగా నాకు రాఖీ కడుతున్నారు. సభలో ఆమె కన్నీరు పెట్టుకుంటే నాకు దుఃఖం ఆగలేదు. తాతా మధు వ్యాఖ్యలపై శాసనసభ తీర్మానం చేసి మండలికి పంపిస్తాం’’ అని స్పీకర్ తెలిపారు.













