భారత యువ షట్లర్ అస్మిత చాలీహా కొరియా ఓపెన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. తన తొలి బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. కొరియా మాస్టర్స్ 300లో మరో భారత షట్లర్ర రక్షిత రామరాజ్పై అస్మిత విజయం సాధించింది. చివరి గేమ్ వరకూ వెళ్లిన పోరులో అస్మత 21-13, 16-21, 21-13 తేడాతో గెలిచింది. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమైన 26 ఏళ్ల అస్మిత గత మేలోనే కోర్టులోకి దిగింది. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది.