
కబ్జాదారులు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారు
నాపై కోర్టు ధిక్కరణ కేసులు పెట్టింది వారే
హైడ్రా కమిషనర్ రంగనాథ్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: “నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో వేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్‌లు కట్టాలని చూస్తున్న ఒక సంధ్యా శ్రీధర్‌రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతున్నారనీ, రూ. వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్ల, ప్రభుత్వ భూము లు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ హైడ్రా కమిషనర్ గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. వీళ్ళు అందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు. వా టిని నేను చట్ట పరంగానే ఎదుర్కుంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. ప్రభుత్వాలు నాకు గతం లో, ఇప్పుడు, మున్ముందు ఏ బా ధ్యతలు అప్పగించినా నేను నా వై పు నుండి 100 శాతం ఫలితాలు ఇవ్వటానికి పని చేస్తున్నాను, చేస్తాను.” అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు.
నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభు త్వ ఆస్తులు, చెరువులు, పార్కులు ర క్షించడం జరిగిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించా రు. మార్కెట్లో వీటి విలువ రూ.1.50 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లు), ఆరు చె రువులను పూర్తి స్థాయిలో పునరుద్ద్ధరించామని రంగనాథ్ వెల్లడించారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పను లు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. బ డాబాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరా ల ప్రభుత్వ భూములను హైడ్రా ఈ రెండు సంవత్సరాలలో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించిందని వివరించారు.
నిజం వైపు ని జాయితీగా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం, ల్యాండ్ మా ఫియా, భూ కబ్జా దారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవపట్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు పదివేల కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టే ట్ సంస్థ కొట్టేయాలని చూసిందని, పర్మిషన్స్ లేకుండా 2500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసిందని ఆయన తెలిపారు. సేవ్ ద రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలతోపాటు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగిందని రంగనాథ్ వెల్లడించారు. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉండాల్సిన లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేయటం జరిగిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.











