నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో అజ్మత్‌అలీ ఇంట్లో భారీ చోరీ జరిగింది. మంగళవారం రాత్రి అలీ ఇంట్లోకి చొరబడిన ఎనిమిది మంది దొంగలు తుపాకులు, కత్తులతో కుటుంబసభ్యులను బెదిరించి, వారిని బంధించి నగదు, నగలను అపహరించారు. రాత్రి లైట్లు ఆర్పేందుకు బయటకు వచ్చిన వృద్ధుడిపై దాడి చేసి ఇంట్లోకి చొరబడ్డారు. 66 తులాల బంగారం, రూ.21లక్షలు, వెండిని ఎత్తుకెళ్లారని బాధితులు ఆరోపించారు. అనంతరం పార్కింగ్‌ చేసిన 2 బైకులను దొంగలు ఎత్తుకెళ్లారు.

The post కరీంనగర్‌లో భారీ చోరీ appeared first on Navatelangana.