
కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకి చెందిన ఒక బస్సు డ్రైవర్, కండక్టర్ చేసిన పని ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. బస్సుకు హెడ్‌లైట్లు లేకుండా ఫోన్ టార్చ్ లైట్‌తో 90 కి.మీ ప్రయాణం చేశారు. కలబురగి సిటీ నుండి చించోలి టౌన్ వరకు దాదాపు 90 కిలోమీటర్ల మేర బస్సు హెడ్‌లైట్లు పని చేయకపోయినా డ్రైవర్ బస్సును నడిపాడు. దట్టమైన చీకట్లో, హైవేపై కండక్టర్ మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ చూపిస్తుంటే..డ్రైవర్ అత్యంత ప్రమాదకరంగా బస్సును నడిపించాడు. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోవైరల్ కావడంతో అధికారులపై, డ్రైవర్ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి .













