మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్ నినో ప్రభావంతో నెర్రలు బారిన జలాశయం, వరద కాలువలు భారీ వర్షాలకు నీటి సవ్వడులతో సందడి చేస్తున్నాయి. వాగుల్లోకి, చెరువులు, చిన్నపాటి కుంటల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఆనందం వ్య క్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడా ది వర్షాకాలం వర్షాభావ పరిస్థితులకు బెంబేలెత్తిన ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రో జులుగా కురుస్తున్న వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వా యుగుండ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

మంత్రులు, అధికారులు వరుస సమీక్షలు నిర్వహించి అధికారులు అప్రమత్తం చేశారు. అ యితే తాజాగా కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తం గా 30శాతంగా ఉన్న లోటు వర్షపాతం, సాధారణ వర్షపాతానికి దగ్గరగా చేరుకుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్1 నుంచి ఈ నెల 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 353.5 మిల్లీ మీ టర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా, ప్ర స్తుతం 315.8 మిల్లీ మీటర్లతో 11 శాతం లోటు నమోదైంది. అయితే రానున్న రెండు రోజుల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ఈ లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం కురిసిన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తానూరు మండలం జురి గ్రామానికి పక్కనే ఉన్న వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.


నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో 1.21 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఉదయం తక్కువగా ఉన్న వరద మధ్యాహ్నానికి ఒక్కసారిగా పెరగడంతో జలాశయం 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రాంగనర్ బ్రిడ్జిపై వరద ప్రవహిస్తుండటంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఉపరితల గనుల్లో భారీ వర్షాలకు వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. రెండు జిల్లాల పరిధిలోని మూడు ఏరియాల్లో ఐదు ఉపరితల గనుల్లో సుమారు 29 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఎగువ చత్తీస్‌గడ్‌లో కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరదన నీరు చేరుతోంది. ప్రాజెక్టులో 24 గేట్లను ఎత్తిన అధికారులు వరదన నీటినికి గోదావరలోకి విడుదల చేస్తున్నారు. తాలిపేరుతో పాటు పలు పరిసర గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి,ప్రాణహిత నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.

కాళేశ్వరంలో ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డి బ్యారేజీకి సైతం వరద ప్రవాహం పెరుగుతోది. ఎగువ నుంచి 1,01,530 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో 85 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భూపాలపల్లిలో సింగరేణి డివిజన్‌లోని కాకతీయఖని 2లో వర్షాల కాలరణంగా బొగ్గు తరలించే వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ములుగు జిల్లా వాజేడు మండంలోని బొగత జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుండటంతో జలపాతం సందర్శనను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, గురువారం 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపల్‌పూర్‌లో 163 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, తరువాత జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయ్ 149.5, అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపుర్‌లో 131.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి సర్కిల్‌లో 18.5 మిల్లీ మీటర్లు, మేడ్చల్ మల్కాజ్‌గిరి నాచారం సర్కిల్‌లో 13.3 మిలీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

శ్రీరాంసాగర్‌కు వరద

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 72,452 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, గురువారం సాయంత్రం వరకు 1066.6 అడుగులకు చేరుకున్నదని అధికారులు తెలిపారు.

నిండుకుండలా ఎల్లంపల్లి

భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్‌లోని ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారింది. శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో ధర్మారం మండలం నంది మేడారం నంది పంప్‌హౌజ్‌లోని బాహుబలి మోటర్లు రెండో రోజు నిరాటకంగా నీటిని ఎత్తిపోస్తున్నాయి. బుధవారం నాడు నాలుగు బాహుబలి మోటార్లను ఆన్‌చేసి 12,600 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్ ద్వారా ఎస్‌ఆర్‌ఆర్‌కు తరలించగా, గురువారం నాడు తాజాగా ఐదవ బాహుబలి మోటర్‌ను ఆన్‌చేసి 15,750 క్యూసెక్కుల నీటిని నంది మేడారం రిజర్వాయర్‌లోకి తరలించి అక్కడినుంచి అండర్‌గ్రౌండ్ టన్నెల్ ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్ రిజర్వాయర్‌కు, అక్కడినుంచి శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్‌కు నిరాటకంగా పంపింగ్ చేస్తున్నారు. ఐదో బాహుబలి మోటార్ ప్రారంభం కావడం ఇదే తొలిసారి. ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు.

జూరాలకు పోటెత్తిన వరద

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు దగ్గర ఇరిగేషన్ అధికారులు 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర 317.51 మీటర్ల లెవెల్ నీరు నిల్వ ఉన్నది. గేట్ల ద్వారా 47,196 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,225 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్- 1కి 1300, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315, లెఫ్ట్ కెనాల్‌కు 870 రైట్ కెనాల్‌కు 500 ల్యారలల్ కెనాల్‌కు 600, భీమా లిఫ్టు- 2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటక ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు 94,733 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండగా జూరాల ప్రాజెక్టు నుంచి 89,799 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు 85 వేల క్యూసెక్కుల వరద

శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి 85 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పాటు కృష్ణానది పరీవాహక ప్రాంతమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సైతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ప్రారంభమైంది.

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు మండలంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు నిండుగా పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల పూసూరు గోదావరి వంతెన వద్ద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం 14. 20 మీటర్లకు చేరుకుంది. చీకుపల్లి, పెద్ద గొల్లగూడెం గ్రామాల మధ్య ఉన్న ఇసుక వాగు వంతెన అప్రోచ్ రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో గత మూడు రోజులుగా అంతరాష్ట్ర రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనివల్ల వాజేడు మండలంలోని 25 గ్రామాల ప్రజలతో పాటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రజలకు పడవ ప్రయాణమే దిక్కయింది. రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఇసుక వాగు వద్ద ప్రయాణీకులు దాటేందుకు ఒక పడవను ఏర్పాటుచేశారు. దీంతో ప్రజలకు పడవ ప్రయాణమే శరణ్యమైంది.

మరో రెండు రోజుల పాటు వర్షాల హెచ్చరికలు

వాయుగుండం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.