విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక కుటుంబ కథా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 (ఎకె47) ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచ యం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. తొలి పాత్రగా విక్టరీ వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రను పరిచయం చేయగా, అనంతరం శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలను పరిచయం చేయనున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ చిట్టిబాబు పాత్రలో అలరించనున్నారు. కుటుంబాన్ని ప్రేమతో, ఆప్యాయతతో, బాధ్యతతో ఒకే తాటిపై నడిపించే కుటుంబ పెద్ద గా ఆయన పాత్ర ఆకట్టుకోనుంది. విడుదలైన పాత్ర పరిచయ వీడియోలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కనిపి స్తూ, నవ్వులు, భావోద్వేగాలు, కు టుంబ అనుబంధాలతో నిండిన చిత్ర ప్రపంచాన్ని అం దంగా పరిచయం చేశారు. చిట్టిబాబు పాత్ర ఆయన కెరీర్‌లో

మరో చిరస్మరణీయమైన పాత్రగా నిలిచేలా కనిపిస్తోంది. ఆనం దం, అనుబంధాలు, కుటుంబ విలువలకు ప్రతిరూపం గా ఈ పాత్ర ఉండబోతోంది. ప్రఖ్యాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.