
అమరావతి: పంచాయతీరాజ్ విభాగంలో ఎఇగా పని చేస్తూ తన కుటుంబంతో కలిసి గోదావరిలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక మత్సకారులు ఎఇ మనమడిని కాపాడారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నూకరాజు అనే వ్యక్తి పంచాయతీరాజ్‌విభాగంలో అసిస్టెంట పని చేస్తున్నాడు. ఆయనకు భార్య మీనా, కూతురు సౌజన్య, మనవడు ఉన్నారు. నూకరాజు తన కుటుంబ సభ్యులు ముగ్గురుతో కలిసి గోదావరి వంతెన వద్దకు చేరుకున్నారు. నలుగురు కలిసి గోదావరి నదిలో దూకారు. మత్యకారులు గమనించి మనవడిని కాపాడారు. మిగిలిన ముగ్గురు గోదావరి నదిలో గల్లంతయ్యారు. మత్సకారుల సమాచారం మేరకు పోలీసులు, గజ ఈతగాళ్లు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వాధికారి తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సిన బాధలు ఏమున్నాయి?. మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైన అవమానిస్తే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











