కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతం సూరారం పోలీస్  స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. సూరారం పోలీస్ స్టేషన్ సమీపంలో ముందు వెళ్తున్న ఐస్ క్రీం బండిని బైక్ ఢీకొట్టడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బైక్ నడుపుతున్న ములాయం సింగ్ (39) తలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.