
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కవిత ఈ నెల 25న సొంత రాజకీయ పార్టీ ప్రారంభించిన విషయం తెలిసిందే. తన పార్టీ పేరు ‘టిఆర్ఎస్’ అని ఆమె ప్రకటించారు. ఈ పార్టీకి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పార్టీ పూర్తి పేరుకు ఐదు పేర్లను పంపించగా.. ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరుకి ఆమోదం లభించింది. బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు ఆమెకు లేఖ అందించారు. పార్టీ పేరుపై పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని సూచించారు. అదే విధంగా పార్టీ పేరుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా తమ దృష్టికి తీసుకురావాలని ఇసి తెలిపింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘‘టిఆర్ఎస్.. నాకు రాసి పెట్టి ఉందేమో. రెండు దశాబ్ధాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం చేస్తున్న కృషిని కొనసాగిస్తా. రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకిత భావంతో పని చేస్తా’’ అని అన్నారు.












