
హైదరాబాద్: నారాయణ పేట జిల్లా కేంద్రం సింగార్‌బేస్ కాలనీకి చెందిన దివ్యాంగ సంఘం నాయకుడు భక్తవత్సలం కుమారుడు కార్తీక్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. హైదరాబాద్ నిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే వైద్యురాలు, ప్రజా సేవకురాలు సుధా కేశవరాజ్ కార్తీక్‌ని కలిసి అతడి ఇష్టాయిష్టాలు అడిగి తెలుసుకున్నారు. అయితే అతడికి మెగాస్టార్ చిరంజీవిని కలవాలనే కోరిక ఉందని చెప్పడంతో సుధా కేశవరాజ్ ఆ విషయాన్ని చిరంజీవికి తెలిపారు. దీంతో చిరంజీవి కార్తీక్‌తో పాటు అతడి అక్కను కలిశారు. అక్కాతమ్ముళ్లతో కలిసి ఫొటోలు దిగారు. కాసేపు చిరునవ్వుతో మాట్లాడారు. చిన్న వయస్సులో క్యాన్సర్ సోకడం బాధాకరమని.. బాధపడకు ధైర్యంగా ఉండు అంటూ ధైర్యం చెప్పారు. కార్తీక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే విధంగా కార్తీక్‌కు తనకు తోచిన సాయం చేస్తానని హామీ ఇచ్చారు.









