హైదరాబాద్: ఖమ్మంలోని జడ్పీ కార్యాలయం సమీపంలోని సోనోవిజన్ దుకాణంలో భారీ చోరీ జరిగింది. అర్థరాత్రి  దొంగలు దుకాణం తాళాలు పగులగొట్టి  చొరబడ్డారు. రూ. కోటి విలువైన వందకు పైగా సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు.