
హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ భారీ సెంచరీ చేసినప్పటికి టీమిండియా ఓటమిని చవిచూసింది. టీమిండియా బౌలర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులు చేసింది. భారత జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసి ఓటమిన మూటకట్టుకుంది. రోహిత్ శర్మ 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138 పరుగులు చేశాడు. లార్స్ లో సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ లార్డ్ లో సెంచరీలు చేయలేదు. 2004లో సౌరవ్ గంగూలీ 90 పరుగులే అత్యధిక కావడం గమనార్హం. లార్డ్ మైదానంలో 39 ఏళ్ల 80 రోజుల వయసులో రోహిత్ శర్మ సెంచరీ చేసి రికార్డు కూడా నెలకొల్పాడు. లార్డ్ మైదానంలో రోహిత్‌ది చివర వన్డే అని పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. లార్డ్ వన్డే ఆఖరి మ్యాచ్ కాదు అని, 2027 వరల్డ్ కప్‌లో కూడా రోహిత్ శర్మ ఆడుతాడని బిసిసిఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపడంలో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. రోహిత్ శర్మ ఎంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం జట్టులో ఉంటాడని సైకియా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రోహిత్ వన్డేలలో 34 సెంచరీలు 11895 పరుగులు చేశాడు. వన్డేలలో 264 పరుగులు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. వన్డేలలో మూడు సార్లు డబుల్ సెంచరీ చేసిన రికార్డు కూడా రోహిత్‌పైనే ఉంది.











