నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట(D) కుకునూర్‌పల్లి(M) లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారిపై లారీని ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసి బస్సు సిద్దిపేట నుండి వెళ్తుండగా మార్గమధ్యలో లకుడారం స్టేజీ వద్దకు రాగానే ఓవర్ టేక్ చేయబోయి, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
The post లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు appeared first on Navatelangana.














