
అమరావతి: లారీని వెనుక నుంచి కారుతో ఢీకొట్టడంతో ఒకరు సజీవదహనమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారి 16పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గండిగుండం పరిధిలోని సత్తరువు చౌరస్తా వద్ద ముందుగా వెళ్తున్న లారీని కారు అదుపుతప్పి ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ కారులో నుంచి బయటకు రాలేక సజీవదహనమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడి వివరాలు వెల్లడిస్తామన్నారు.








