
లద్ధాక్: లద్ధాక్‌లోని లేహ్ పర్వత ప్రాంతంలో ఓ ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలింది. లెఫ్టినెంట్ కల్నల్, ఇద్దరు మేజర్లతో ప్రయాణిస్తున్న చీతా హెలికాఫ్టర్ సాంకేతిక సమస్యతో ఒక్కసారిగా కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికాధికారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మే 20న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం అనంతరం మిగిలిన ఇద్దరితో కలిసి మేజర్ జనరల్ సచిన్ మెహతా తీసుకున్న సెల్ఫీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.











