
న్యూఢిల్లీ: పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారు, అందులో భాగస్వాములైన వారిని కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించేందుకు ఉద్దేశించిన ‘పబ్లిక్ పరీక్షల (అనుచిత పద్ధతుల నివారణ) సవరణ బిల్లు 2026’కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు గురువారంనాడు రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్‌సభలోనూ బుధవారంనాడు సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఈ సవరణ బిల్లు ఆమోదం పొందింది. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లోనూ చట్టసవరణకు ఆ మోదం లభించినట్టయింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రభుత్వం పంపించనుంది. రాష్ట్రపతి ఆమోదం తెలపగానే బిల్లు చట్టరూపం సంతరించుకుంటుంది.
పబ్లిక్ పరీక్షల (అనుచిత పద్ధతుల నివారణ) సవరణ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఏడు గంటల పాటు తెచ్చిందని, సమస్యను పరిష్కరించేందుకు మాత్రం కాదని అన్నారు. పేపర్ లీక్‌లు జరక్కుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై కేంద్రం వివరించ లేదని తప్పుపట్టారు. భారీ జరిమానాలు, కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. ప్రభుత్వం ఎలా పరీక్షలు నిర్వహిస్తుందనే దానిపైనే పేపర్ లీక్‌ల వ్యవహారం ఆధారపడి ఉంటుందన్నారు. ఇన్‌స్టిట్యూషన్లు, పరీక్షల సిస్టమ్‌ను సంస్కరించడం, జవాబుదారీతనం లేకపోతే పేపర్ లీక్‌లు జరుగుతూనే ఉంటాయని, దీనిపైనే మళ్లీ మనమంతా చర్చించాల్సి వస్తుందని అన్నారు.
సొంత కుర్చీని కాపాడుకునేందుకే..
పేపర్ లీక్‌లతో అమాయకులైన విద్యార్థులు, వారి కుటుంబాలు బాధితులయ్యాయని ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ సమయంలోనే పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తారని, 2024లో బిల్లు ఆమోదించినప్పుడు కూడా కఠిన చట్టం ఉండాలని విపక్షాలు డిమాండ్ చేశాయని ఆయన గుర్తుచేసారు. అయితే రాజకీయ కారణాలతోనే కేంద్రం హడావిడిగా చట్టం చేసిందని ఆరోపించారు. ‘చట్టం తెచ్చిన రెండేళ్లలోనే దానికి మీరు సవరణలు చేశారు. అయినప్పటికీ ఇది అసంపూర్తిగానే ఉంది’ అని ఖర్గే అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన విద్యార్థులను ఆయన అభినందించారు. విద్యార్థుల బలమైన వాణితో పాటు పార్లమెంటులో విపక్షాల నిరనసలతో ప్రభుత్వం ఎట్టకేలకు విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చేందుకు దిగివచ్చిందని చెప్పారు. ప్రధానమంత్రి తన సొంత కుర్చీని కాపాడుకునేందుకే ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించారని అన్నారు. చర్చలు కోరుతున్న యువతను జాతివ్యతిరేకులుగా చిత్రీకరించి వాటితో చర్చలు జరిపేందుకు కేంద్రం ఇష్టపడలేదన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు పెల్లెట్ గన్లతో కాల్పులు జరపడం వల్ల అనేకమంది ఐసీయూలో చేరాల్సి వచ్చిందన్నారు. ఇంత అలజడి రేగుతున్నా ప్రధానమంత్రి, హోం మంత్రి సభకు హాజరుకాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ‘ఇది సిగ్గుచేటు. ఆయన సిగ్గుపడుతున్నారో లేదో నాకు తెలియదు. విద్యార్థులపై అఘాయిత్యాలకు బాధ్యులెవరు?’ అని హోం మంత్రిని నిలదీశారు. విద్యార్థులపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడానికి ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పాలని, సాధారణ దుస్తుల్లో విద్యార్థులపై దమనకాండకు పాల్పడినదెవరో వెల్లడించారని, హోం మంత్రి రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్, బిహార్ వంటి రాష్ట్రాల్లో పోలీసు చర్య అంశాన్ని కూడా ఖర్గే ప్రస్తావించారు. విద్యార్థులపై పోలీసులు ఎకే-47లు ఎక్కుపెట్టారని అన్నారు. మోదీ హయాంలో దేశవ్యాప్తంగా పలుమార్లు పేపర్ లీక్‌లు జరిగాయని, కానీ ప్రభుత్వం మొద్దునిద్ర పోయిందని విమర్శించారు. 2024 నీట్ పేపర్ లీక్ ప్రధాన నిందితుడికి క్లీన్ చిట్ ఇచ్చారని తప్పుపట్టారు.
విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు బిల్లే నిదర్శనం: జితేంద్ర సింగ్
సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరణ ఇస్తూ, పరీక్ష పత్రాల లీక్‌లను ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని, విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేయడాన్ని అనుమతించేది లేదని చెప్పారు. విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని చెప్పారు. ఈ బిల్లును తీసుకురావడానికి ప్రధాని ఏమాత్రం ఆలస్యం చేయలేదన్నారు. అందరి నుంచి నిర్మాణాత్మక సూచలను తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. యూపీఏ హయాంతో సహా వివిధ ప్రభుత్వాల హయాంలో పేపర్ లీకేజీ కేసుల జాబితాను మంత్రి చదవి వినిపించారు. ఈ కేసులపై దృష్టి సారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కానున్నాయని చెప్పారు.











