
లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి రోహిత్, రికెల్టన్ మెరుపు ఆరంభాన్ని అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రికెల్టన్ 32 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. రోహిత్ 44 బంతుల్లోనే 83 పరుగులు సాధించాడు. నమన్ ధిర్ 23 (నాటౌట్), విల్ జాక్స్ 10 (నాటౌట్)లు కూడా తమవంతు సహకారం అందించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పూరన్ వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన పూరన్ 15 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓపెనర్ మిఛెల్ మార్ష్ కూడా మెరుగైన బ్యాటింగ్‌తో అలరించాడు. జోష్ ఇంగ్లిస్ 3 ఫోర్లతో వేగంగా 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత పూరన్, మార్ష్‌లు స్కోరును పరిగెత్తించారు. చెలరేగి ఆడిన మార్ష్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 34 బంతుల్లోనే 94 పరుగులు జోడించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన పూరన్ 21 బంతుల్లోనే 8 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 63 పరుగులు చేశాడు. మార్‌క్రమ్ 31 (నాటౌ), హిమ్మత్ సింగ్ 40 (నాటౌట్) కూడా రాణించడంతో లక్నో భారీ స్కోరును సాధించింది.












