నవతెలంగాణ – హైదరాబాద్ : రూ.లక్ష లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారిని ఏసీబీకి పట్టుబడింది. బోరబండ జీహెచ్ యంసీ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీలత ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్ క్లియర్ చేసేందుకు బాధితుడి నుండి రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసింది. అందులో భాగంగా రూ.లక్ష తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.

The post లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్ appeared first on Navatelangana.