
కొలంబో: శ్రీలంకలోని తీరపట్టణంలో ఉన్న నెగోంబో జైలులో ఘర్షణల్లో 25 మంది మృతి చెందారు. ఈ జైలులో ఆదివారం ఇరువర్గాలకు చెందిన ఖైదీల గుంపుల మధ్య కొట్లాట జరిగింది. ఇది క్రమేపీ హింసాత్మకం అయింది. రక్తపాతానికి దారితీసింది. రెండు వర్గాలు ఆవేశాలతో మరుసటి రోజు సోమవారం కూడా బాహాబాహీకి దిగాయి. కర్రలు , గునపాలతో పరస్పరం దాడులకు దిగారని వెల్లడైంది. ఘర్షణల్లో వంద మందికి పైగా గాయపడ్డారు. చాలా కాలంగా ఇక్కడి జైలులో రెండు వర్గాల మధ్య తరచూ తగాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి.
జైలులో డ్రగ్స్ అక్రమ పంపిణీకి దిగుతున్న గ్యాంగ్‌ను , దీనిని అడ్డుకుంటున్న ఇతర ఖైదీల మధ్య తరచూ ఘర్షణలు జైలులో అశాంతికి దారితీస్తోంది. ఘర్షణల అదుపు ఇప్పుడు జైలులోని భద్రతా సిబ్బందితో సాధ్యం కావడం లేదు. దీనితో ఇక్కడ భద్రతను కాపాడేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు (ఎస్‌టిఎఫ్)ను రంగంలోకి దింపారు. ఇప్పటి ఘటనలు రక్తపాతంపై జైళ్ల శాఖ దర్యాప్తు చేపట్టింది.












