ముంబై: శ్రీలంకతో జరిగే రెండు మ్యా చ్‌ల టెస్టు సిరీస్ కో సం టీమిండియాను ఎంపిక చేశారు. శ్రీ లంక గడ్డపై ఆగస్టు 15 నుంచి ఈ సిరీస్ జరుగనుంది. ఇందు కోసం 15 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. శుభ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. కెఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆఫ్ స్పిన్నర్ సరాంశ్ జైన్ తొలిసారి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సరాంశ్‌ను జట్టులోకి తీసుకున్నారు. సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా కూడా సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అయితేనే అతను సిరీస్‌లో పాల్గొంటాడు. ఇక సాయి సుదర్శన్ కూడా ఫిట్‌నెస్‌లో నెగ్గితేనే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఇక హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు జట్టులో చోటు లభించింది.

జట్టు వివరాలు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్‌ప్రిత్ బుమ్రా, సిరాజ్, గుర్నూర్ బ్రార్, పడిక్కల్, సరాంశ్ జైన్.