
న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళన నడుమ లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. పేపర్ లీకులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా 2014 పరక్షల (అకరమ పద్ధతుల నివారణ’) చట్ట సవరణ బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు వచ్చినా.. బిల్లపై చర్చించడం సాధ్యం కాలేదు. ఓ వైపు విపక్షాల ఆందోళనలు కొనసాగుతుండానే.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉదయం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు అనంతరం లోక్ సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
సభ తిరిగ ప్రారంభమైన వెంటనే.. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ మరోసారి సభను మధ్యాహ్నం 5 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా చర్చ చేపట్టకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పేపర్ లీక్ (సవరణ) చర్చకు రాకుండా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ఈ బిల్లుపై సభలో మంగళవారం చర్చించి.. అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.











