
మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టుల చ రిత్రలో ఇదే అతిపెద్ద ఆఖరి లొంగుబాటని, ఈ స్థా యిలో మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఇకపై లేదని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. శనివా రం డిజిపి కార్యాలయంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు(డికెఎస్‌జడ్‌సి), దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇంచార్జ్ హేమ్లా ఐతు అలియాస్ విజ్జా, డివిజనల్ కమిటీ సభ్యుడు పోడియం లచ్చు అలియాస్ మనోజ్ తో సహా 47 మంది అ జ్ఞాత మావోయిస్టులు 32 ఆయధాలతో డిజిపి ఎ దుట లొంగిపోయారు. లొంగిపోయిన వారు చత్తీస్‌గఢ్‌కు చెందిన వారని అయినా వీరంతా రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, చర్ల ఏరియాలో పనిచేయడంతో రాష్ట్రంలో లొంగిపోయిన ట్లు డిజిపి వివరించారు. ఈ లొంగుబాటుతో పిల్‌జిఎ బెటాలియన్ అంతమయ్యిందని, దాదాపుగా బెటాలియన్‌లోని అందరూ కీలక మావోయిస్టులు బయటకు వచ్చారని తెలిపారు. ఎన్‌సిసి(ఉత్తర స మన్వయ కమిటీ) పేరుతో మావోయిస్టులు విడద ల చేసిన లేఖపై స్పందిస్తూ మావోయిస్టుల చరిత్ర లో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు లొంగిపోయిన వారు ఎప్పటికీ దేవుళ్లలాగా కనిపించరని,
లేఖ ఢిల్లీ నుంచి విడుదలయినట్లు సమాచారం ఉందని, అసలు లేఖ నిజమయినదా, కాదా అని విచారిస్తున్నట్లు చెప్పారు. మావోయిస్టు నగదు డంపులపై ఇతర రాష్ట్రా పోలీసులు ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారని, రాష్ట్ర పోలీసుల సెర్చ్ ఆపరేష్‌న్ సైతం కొనసాగుతుందని వెల్లడించారు. రా ష్ట్ర పోలీసులు కృషితో 125గా ఉన్న రాష్ట్ర మావోయిస్టు కమిటీ సంఖ్య నేడు నలుగురికే పరిమితమయ్యిందని, మిగిలిన వారిలో ముప్పాళ్ల లక్ష్మణ్ రా వు అలియాస్ గణపతి, పసునూరి నరహరిలు కేం ద్ర కమిటీ సభ్యులుగా, జోడే రత్నాబాయి, వార్తా శేఖర్‌లు రాష్ట్ర కమిటీ సభ్యులు కొనసాగుతున్నారని వివరించారు. వీరిలో ముప్పాళ్ల లక్ష్మన్ రావు మావోయిస్టు కార్యాకాలాపాల్లో చురుగ్గా లేకపోయినా ఆయన పేరు మాత్రం కేంద్ర కమిటీలో కొనసాగుతోందని డిజిపి తెలిపారు. లొంగిపోయి న వారిలో 27 మంది దండకారణ్యం స్పెషల్ జోన ల్ కమిటీ సభ్యులు(డికెఎస్‌జడ్‌సి), నలుగురు పీపు ల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్(పిఎల్‌జిఏ) సభ్యులు, 16 మంది, 9, 30వ ప్లటూన్‌కు చెందిన డివిజనల్ కమిటీ, డికెఎస్‌జడ్‌సి సభ్యులని తెలిపారు. అజ్ఞాతం వీడిన మావోయిస్టుల నుంచి వివి ధ రకాలకు చెందిన 32 ఆయుధాలు,
26 మ్యా గ్జిన్స్, 515 తూటాలు, ల్యాండ్ మైన్స్‌కు అమర్చేందుకు వినియోగించే వంద కేజీల కార్డెటెక్స్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిలో ఒక ఎల్‌ఎంజి, నాలుగు ఎకె47 రైఫిళ్లు, మూడు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, రెండు ఇన్సాస్, రెండు 410 మస్కెట్ రైఫిళ్లు, ఒక 8 ఎంఎం రైఫిల్, 12 సింగిల్ షాట్ గ న్‌లు, రెండు ఎయిర్ గన్‌లు, ఒక ఎస్‌బిబిఎల్ ఆ యుధాలు ఉన్నట్లు వెల్లడించారు. పునరావాస పథకంలో భాగంగా తక్షణ సహాయం కింద రూ.25 వేలతో పాటు, వారిపై ఉన్న మొత్తం 1.50 కోట్ల రివార్డు బహుమతిని అందచేస్తామన్నారు. దీంతో పాటు ఆయుధాలతో లొంగిపోయిన వారికి కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం రివార్డు బహుమతి ఇస్తామని తెలిపారు. కాగా, సిఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు మావోయిస్టుల వైద్య కోసం త్వరలోనే జీఓ రాబోతుందని, లొంగిపోయన ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత ప్రభుత్వ హామీగా డిజిపి పేర్కొన్నారు.
నాలుగు నెలల్లో 260 మంది
మావోయిస్టుల లొంగుబాటు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ ఏడాది నాలుగు నెలల్లో 260 మంది మావోయిస్టులు 238 ఆయుధాలతో లొంగిపోయారని డిజి పి వెల్లడించారు. ఈ క్రమంలో 2024 నుంచి ఇప్ప టి వరకు వివిధ క్యాడర్లకు చెందిన 818 మంది మావోయిస్టులు, 334 ఆయుధాలతో లొంగిపోయారని రాష్ట్ర చరిత్రలోనే ఇది అతి పెద్ద లొంగుబాటు శకంగా డిజిపి చెప్పారు. ప్రస్తుతం లొంగిపోయిన డికెఎస్‌జడ్‌సి సభ్యుడు హేమ్లా ఐతు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడిగా కీలక నేతగా ఉన్నారని, పొడియం లచ్చు అలియస్ మ నోజ్ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీలో 9వ ప్లాటూ న్ కమాండర్‌గా పనిచేస్తున్నాడని, సుమారు 17 సంవత్సరాలుగా అజ్ఞీత జీవితం గడుపుతున్నట్లు డిజిపి వివరించారు.











