లండన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ విభాగానికి చెందిన సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్‌తో పాటు లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ రంగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుకు లివర్‌పూల్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు.

ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు లివర్‌పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌లో పర్యటించనుంది.