హైదరాబాద్: ఇంగ్లాండ్, ఐర్లాండ్ జరిగిన సిరీస్‌లను కోల్పోవడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాన కోచ్ గంభీర్‌కు విశ్రాంతిని ఇచ్చి జింబాబ్వే టూర్‌కు వివిఎస్ లక్ష్మణ్ కోచ్‌గా నియమించారు. వివిఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జింబాబ్వేను భారత జట్టు క్లీన్ స్వీప్ చేయడంతో ఆయనకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించారు. వివిఎస్ లక్ష్మణ్ సర్ నిరంతరం ప్రోత్సహించడంతో భారత జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపారన్నారు. మైదానంలో దిగిన ప్రతిసారి లక్ష్మణ్ సర్ చెప్పిందే నిజమైందని కొనియాడారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, జట్టులో ప్రతి ఒక్కరూ సహాయ సిబ్బందితో కలిసి నిరంతరం శ్రమించామన్నారు. ఈ సిరీస్‌లో వదిలేసిన క్యాచ్‌లు మినహా ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ఆడామని శ్రేయస్ తెలియజేశారు. ఈ సిరీస్ విజయం క్రెడిట్ మాత్రం శ్రేయస్ దక్కుతుందని వివిఎస్ లక్ష్మణ్ తెలిపాడు. శ్రేయస్ నాయకత్వం ప్రయాణం చాలా కష్టంతో ప్రారంభమైందని, జింబాబ్వే సిరీస్‌లో సూపర్ కమ్ బ్యాక్ అని లక్ష్మణ్ కొనియాడారు. జట్టులో చాలా మంది యువకులు ఉన్నారని, ఇంగ్లాండ్ సిరీస్ లో నలుగురు మాత్రమే ఉన్నారని తెలియజేశారు.