డిస్పూర్: అస్సాంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికను అత్యాచరం చేసి.. హత్య చేశారు. అతి దారుణమైన స్థితిలో కుటుంబ సభ్యులే గుర్తించలేని స్థితిలో ఆమె ఇంట్లో శవమై కనిపించింది. అస్సాంలోని హైలాఖాండీ జిల్లాకు చెందిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లింది. అయితే అక్కడ తన కజిన్‌తో గొడవ కారణంగా తిరిగి ఇంటికి వచ్చేసింది.

వేడుక అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చే సరికి తమ కుమార్తెను ఆ స్థితిలో చూసి హతాశులయ్యారు. హత్య చేయడానికి ముందు తమ బిడ్డపై అత్యాచారం జరిగిందని వారు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె తల, ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైందని, ప్రైవేటు భాగంలోకి రాడ్డు చొప్పించారని పోలీసు వర్గాలు తెలిపాయి. పోస్ట్ మార్టం అనంతరం లైంగిక దాడి జరిగిందా లేదా అనేది తెలుస్తుందని, హత్యకు గల కారణాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని జాతీయ రహదారిని దిగ్భంధించారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.