నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య తనూజ హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త దిలీప్‌తో పాటు నేపాలీ వాచ్‌మన్ సునీల్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కల్పనకు మరో ఆరుగురు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఏడుగురు కలిసి దోపిడీ చేసి, హత్య అనంతరం బంగారాన్ని పంచుకుని పరారైనట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితులు నేపాల్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
The post మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య..మరో ఇద్దరు అరెస్ట్ appeared first on Navatelangana.














