మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎలుగు పార్వతమ్మ–యాదయ్య దంపతుల కుమారుడు సందీప్ గత నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడు సందీప్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తాను కుటుంబానికి అండగా ఉంటానని, అధైర్యపడవద్దని యాదయ్య, పార్వతమ్మలను రాజగోపాల్ రెడ్డి ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు పైల్ల సోమిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, నాయకులు పర్రెపాటి యుగంధర్, తండ సత్తయ్య, నారగొని అంజయ్య, కారుపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.