
పనకబండ మాజీ సర్పంచ్ ,మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు , మాజీ సింగల్ విండో చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని హనుమంతు గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం హనుమంతు భౌతికకాయాన్ని సందర్శించి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పోన్నె బోయిన రమేష్ ,మాజీ మార్కెట్ చైర్మన్లు కొణతం యాకూబ్ రెడ్డి, తీపిరెడ్డి మెఘారెడ్డి ,అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండ సోంమల్లు మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్ ,పానుగుల్ల విష్ణుమూర్తి, గ్రామ శాఖ అధ్యక్షులు లోతకుంట స్వామి, మాజీ సర్పంచ్లు బయ్యని పిచ్చయ్య, బత్తిని తిరుమలేష్ ,ఎలుగు సోమయ్య, నాయకులు పోన్నెబోయిన నర్సయ్య, పైళ్ల బుచ్చయ్య, పోన్నెబోయిన అంజయ్య ,బత్తిని అంజయ్య ,పోన్నె బోయిన మచ్చగిరి ,పైళ్ల రమేష్ ,బత్తిని మహేష్, కనేబోయిన లింగం, వల్లందాస్ బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.













