
అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకుంటున్న విద్యార్థులు.
మన తెలంగాణ/మోత్కూర్ : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అక్షర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ (ఎస్.ఆర్.ఎఫ్) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఒలంపియాడ్ టాలెంట్ టెస్ట్ లో పాఠశాల విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచారు. విజేతలకు హైదరాబాదులోని శిల్పకళా వేదిక ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, అవార్డులు నిర్వాహకులు అందజేసినట్లు పాఠశాల డైరెక్టర్లు మలిపెద్ది రాజిరెడ్డి, మల్లిపెద్ది శివానీలు గురువారం విలేకరులకు తెలిపారు.
ఒలంపియాడ్ టాలెంట్ టెస్టులు జి మోక్షిత 9వ తరగతి, పి లోకేష్ 8వ తరగతి , పి హర్షిత ఏడవ తరగతి, పి పూజిత ఆరవ తరగతి , ఎం. మాన్విక్ రెడ్డి మూడవ తరగతి విద్యార్థులు స్టేట్ టాపర్లుగా నిలిచారు. అదే విధంగా జిల్లా టాపర్లుగా బీ లిఖిత 9వ తరగతి, పి వైష్ణవి 8వ తరగతి, ఏ అర్జున్ ఏడవ తరగతి, ఎన్. రోసి గ్రేసీ ఆరవ తరగతి, గాదెనబోయిన సాయి నక్షత్ర 5వ తరగతి, ఎం అక్షిత్ రెడ్డి ఐదవ తరగతి , జీ సాన్విక నాలుగవ తరగతి, బి శ్రేయాన్స్ మూడవ తరగతి, ఎన్ ఆదిత్య రెండవ తరగతి, ఎం విజ్ఞారెడ్డి ఒకటో తరగతి విద్యార్థులు ఎంపికయ్యారు.
డిస్టిక్ కన్సోలేషన్ టాపర్లుగా సిహెచ్ శ్రీహర్షిని, కే జస్వంత్ రెడ్డి, జే హర్షవర్ధన్, డి సాత్విని , ఈ. లాస్య, జె .సాయి నిఖిల్, ఏ విక్రం రెడ్డి, టీ అలేఖ్య, బి అభిరామ్, కే గోపీనాథన్ రెడ్డి అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలు అందుకున్నట్లు పాఠశాల డైరెక్టర్లు రాజిరెడ్డి శివానిలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి సీతక్క, ఎన్‌ఐటి రాయపూర్ డైరెక్టర్ రమణారావు తదితరులు హాజరయ్యారు. శ్రీ రామానుజ ఫౌండేషన్ ప్రెసిడెంట్ తుమ్మ అమరేష్, డాక్టర్ ఎలమంచిలి జగదీష్ బాబు, చిరంజీవి శ్రేయాన్స్ మురళీకృష్ణ, సామాజిక కార్యకర్త అన్నం శ్రీనివాస్, ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.










