నవతెలంగాణ-మల్హర్‌రావు: మండలంలోని అన్సాన్పల్లి గ్రామానికి చెందిన నానుమాల ఆర్చిత యాదవ్ వరంగల్ జిల్లా పాకాలకొత్తగూడ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో చదివి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 531 మార్కులు సాధించింది.దీంతో శుక్రవారం ఆర్చితను బీఆర్ఎస్ నాయకుడు ఢిల్లీ రాజు శాలువాతో సన్మానించి,డిక్షనరీని అందజేశారు.ఈ సందర్భంగా రాజు మాట్లాడారు.. భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
The post పదిలో ఉత్తమ మార్కులు.. ఆర్చిత యాదవ్‌కు సత్కారం appeared first on Navatelangana.











