అమరావతి: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో దారుణం జరిగింది. మామను, అల్లుడు కత్తితో చంపాడు. ఈ ఘటన ముత్తూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా అల్లుడు గున్నస్వామికి, తన భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఒక రోజు అర్థరాత్రి భార్యా, భర్తకు వివాదం జరగడంతో మధ్యలో మామ ఏడుకొండలు అడ్డుపడ్డాడు. అందుకు మామపై కత్తితో పొడిచి చంపాడు.  కుటుంబసభ్యులు నెల్లూరు ఆస్పత్రికి తరలిస్తుండగా ఏడుకొండలు మృతి చెందాడు. భార్య మస్తానమ్మకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.