
గాంధీనగర్: మానసిక వికలాంగురాలైన మేనకోడలుపై వృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం మహిసాగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లూనావాడా టౌన్‌లో 26 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. 70 ఏళ్ల వృద్ధుడు వరసకు మేనకోడలు అయ్యే సదరు యువతిపై కన్నేశాడు. వృద్ధుడు సదరు యువతిని ఒంటిరిగా ఇంటికి రప్పించి అనంతరం ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. యువతి తన తల్లికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.













